ఇండోర్: ఇండియన్ ఓపెన్ స్కాష్ టోర్నీలో యువ సంచలనం అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏండ్ల అనాహత్ 3-2(11-8, 11-13, 11-9, 6-11, 11-9)తో సీనియర్ ప్లేయర్ జోష్న చిన్నప్పపై అద్భుత విజయం సాధించింది.
55 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో జోష్నను ఓడించడం ద్వారా అనాహత్ తన కెరీర్లో 13వ పీఎస్ఏ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది.