నస్రుల్లాబాద్ : వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి ( Sub Collector Kiranmayi ) అన్నారు. బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( Primary Health Centre) ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని మందుల స్టాక్ (Medicine Stock) ను పరిశీలించారు.
రోగులకు సరిపడా సిబ్బంది ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల వద్దకు వెళ్లి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్ష గది, కాన్పుల గది, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం గ్రామపంచాయతీ అవెన్యూ ప్లాంటేషన్ ను సందర్శించారు. మొక్కలకు నీళ్లు పోయడాన్ని ఆమె పరిశీలించారు. వేసవికాలం నీటి సరఫరా అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లతా, ఎంపీడీవో భాను ప్రకాష్ ,ఆయా శాఖల అధికారులు ఉన్నారు.