War 2 | మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో టాప్‌లో ఉంటాయి కూలీ, వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం కూలీ.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెర తెరకెక్కిన కూలీ కూడా ఇదే రోజున (ఆగస్టు 14) విడుదలవనుంది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా ఉండగా.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కూలీ తమిళంలో తెరకెక్కగా.. వార్ 2 హిందీలో తెరకెక్కింది. ఈ రెండు సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఒరిజినల్ వెర్షన్లతో కలిసి విడుదల కాబోతున్నాయి.
కాగా వార్ 2, కూలీ చిత్రాలకు తెలుగులో సంభాషణలు రాసిన వ్యక్తి ఎవరో తెలుసా..? రాకేందు మౌళి. ఈ టాలెంటెడ్ రైటర్ గతంలో యానిమల్, ఖైదీ సినిమాలకు డైలాగ్స్ అందించగా.. బాక్సాపీస్‌ను షేక్ చేస్తున్న మహావతార్ నర్సింహకు డైలాగ్స్ అందించాడు. మరి వార్ 2, కూలీ సినిమాలకు రాకేందు మౌళి ఎలాంటి సంభాషణలు సిద్ధం చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టాలెంటెడ్ రైటర్ డైలాగ్స్‌తోపాటు కొన్ని పాటలను కూడా రాయడం విశేషం. మరి ఈ రెండు సినిమాల విడుదల తర్వాత రాకేందు మౌళి కెరీర్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Megastar Chiranjeevi | సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై అందుకే స్పందించను : చిరంజీవి
Jurassic World Rebirth | ఓటీటీలోకి వచ్చేసిన ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’.. కానీ వారికి మాత్రమే.!