దేవరకొండ, ఫిబ్రవరి 05 : కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయవద్దని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని 5, 6, 10వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మరోమారు మోసపోవద్దన్నారు.
దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పా మరొకటి లేదన్నారు. దేవరకొండ పట్టణం అభివృద్ధి జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులు అభివృద్ధి జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాజుల ఆంజనేయులు, కేతావత్ బిలియా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, హరిలాల్, హరిదాస్ శివ భారతి పాల్గొన్నారు.