తుంగతుర్తి, ఫిబ్రవరి 24 : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, స్కేలులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అల్వాల ప్రవీణ్ కుమార్, మందడి కవిత, పీడీ కొండగడుపుల యాకయ్య, ఉపాధ్యాయులు గుజ్జ భాస్కర్, సహదేవ్, రాజు, కొండ పరశురాం పాల్గొన్నారు.