నిర్మల్ అర్బన్, మార్చి 17 : వ్యక్తిగత శుభ్రతతోనే ప్రాణాంతకమైన వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు. యునిసెఫ్, వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యక్తిగత శుభ్రత, కొవిడ్ అవగాహన ప్రచార రథాన్ని మంత్రి నివాసంలో గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రచార రథం లక్ష్మణచాంద మండలంల ప్రజలకు అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆ రోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులను మంత్రి అభినందించారు. మేనేజర్ బ్రహ్మయ్య, కో ఆర్డినేటర్ విష్ణువాస్, అశోక్, శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, మారుగొండ రాము పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కౌన్సిలర్ సయ్యద్ జహీర్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంఐఎం నాయకుడు జహీర్‌ను పరామర్శించారు. స్థానిక శివాజీ చౌక్‌లో ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయిన దుకాణాన్ని పరిశీలించారు. నష్ట పరిహారం అందించేలా చూడాల ని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎంఐఎం నాయకులు ముజాహిద్ అలీ, సయ్యద్ అబ్రార్, సయ్యద్ మజార్, రఫీ హైమద్ ఖురేషీ, ఉస్మాన్ ఉన్నారు.
నిర్మల్ టౌన్, మార్చి 17 : కలెక్టర్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పథకాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం 80వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులు కష్టపడి చదివి కొలువులు సాధించాలని సూచించారు. అందుకు ప్రభుత్వం ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటున్నామని, ఇప్పటికే ఐకేపీ, మెప్మా, ఫీల్డ్ అసిస్టెంట్లకు వరాలు కురిపించినట్లు చెప్పా రు. దళితబంధు పథకానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం పూర్తయిందని, వచ్చేనెలలో ప్రారంభిస్తామన్నారు. అట్రాసిటీ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని, బాధితులకు పరిహారం అందే లా చూడాలన్నారు. జిల్లాలో ప్రమాదాలతో యు వకులు ఎక్కువగా చనిపోతున్నారని, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. కొన్ని పార్టీలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. పెంబి మండలంలోని చాకిరేవు గిరిజనులు 60 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించేందుకు వస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఎప్పుడైనా ఆ గ్రామాలను ఆ నేతలు సందర్శించా రా? అని ప్రశ్నించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హే మంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వ ర్, జిల్లా అధికారులు సుధీర్‌కుమార్, విజయలక్ష్మి, జయంత్‌రావు చౌహాన్, వెంకటేశ్వర్రావు, రమేశ్ రాథోడ్, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ముత్తన్న, దేవేందర్, శ్రీనివాస్‌బాబు, శ్యాంరావు, శంకరయ్య, అంజిప్రసాద్, అశోక్, సుధారాణి, మల్లికార్జున్, హన్మండ్లు, అశ్వక్, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో సైకిల్‌క్లబ్ లోగోను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆవిష్కరించారు. ప్రముఖ వైద్యులు రామకృష్ణ, దేవేందర్‌రెడ్డి, వీ రాజనర్సింహారెడ్డి, రఘురెడ్డి, రాంచందర్‌రెడ్డి, రాకేశ్ రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, సెర్ప్, ఐకేపీ, మెప్మా సంఘాల సభ్యులు వేర్వేరుగా మంత్రి అల్లోలను కలిసి కృతజ్ఞతలు తె లిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ పత్రాన్ని అందించారు. మెప్మా పీడీ సుభాష్, ఐకేపీ సెర్ప్ ఉద్యోగుల సంఘం నాయకులు హేమలత, సుధాకర్, సురేశ్, గోవింద్‌రాజు, ప్రసాద్, మంజుల, శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ అధ్యక్షుడు మహేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మార్చి 17 : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ప్, మెప్మా ఉద్యోగులకూ వేతనాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మెప్మా, ఐకేపీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. మెప్మా పీడీ సుభాష్, గోవింద్ రావు, విజయలక్ష్మి, మంజుల, సుధాకర్, ఐకేపీ ఉద్యోగులు సావిత్రి, శోభ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.