కామారెడ్డి : రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు భరోసా, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం భిక్నూర్ మండల అధ్యక్షులు రంజిత్ వర్మ దోమకొండ మండల అధ్యక్షులు పాలకుర్తి శేఖర్ మాచారెడ్డి మండల అధ్యక్షులు లష్కర్ నాయక్ కామారెడ్డి మండల ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పాల్వంచ మండల అధ్యక్షులు దేవరాజ్ రామారెడ్డి మండల నాయకులు సతీష్ రాజంపేట మండలం నాయకులు రామ్మూర్తి గౌడ్ కామారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ కోశాధికారి సాయి ప్రచార కార్యదర్శి సంగమేశ్వర్ కామారెడ్డి మండల నాయకులు పరుశురామ్ గౌడ్ బాబా గౌడ్ సమీర్ సాయి గఫార్ భాను కిరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.