పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి ఏమన్నారంటే?
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి ఏమన్నారంటే? | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశ అవసరాల కోసం 80శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయన్నారు. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత యూపీఏ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆరోపణలు చేశారు. ధరల పెంపునకు గత యూపీఏ ప్రభుత్వం సైతం ప్రధానకారణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై కాంగ్రెస్ లక్షల కోట్ల రూపాయల బాండ్లను వదిలేసిందని, వాటిని తిరిగి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మేలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇప్పటి వరకు ఇంధన ధరలు 29 సార్లు పెరిగాయి. మంగళవారం పెట్రోల్‌పై 29 పైజలు, డీజిల్‌పై 28 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ 0.60 శాతం పెరిగి బ్యారెల్‌కు 75.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

