Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) మరణించారంటూ ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ (Esha Deol) ఖండించారు. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.
‘మీడియా ఓవర్ డ్రైవ్‌లో మునిగిపోయి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఇషా డియోల్ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, 89 ఏండ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ముంబై (Mumbai)లోని క్యాండి ఆస్పత్రిలో (Candy Hospital) చేరారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. నిన్నటి వరకూ ధర్మేంద్ర వెంటిలేటర్‌పై ఉన్నారంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అయితే, ఇవాళ ఉదయం ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచినట్లుగా సదరు కథనాలు వెల్లడించాయి. అయితే, ధర్మేంద్ర మరణించారంటూ వస్తున్న వార్తలను ఆయన కుమార్తె ఇషా డియోల్ తాజాగా ఖండిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Also Read..
Dharmendra | బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర కన్నుమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ
Shiva Squel | శివ సీక్వెల్‌పై నోరు విప్పిన ఆర్జీవీ.. హీరో ఎవరో కాదు..!