Globe Trotter | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తోన్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నవంబర్ 15న జరగబోయే “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్‌కు ముందుగానే హైప్‌ను రెట్టింపు చేస్తూ జక్కన్న చేసిన ప్రమోషన్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల విలన్ పాత్ర “కుంభ” (మలయాళ స్టార్ పృథ్వీరాజ్) ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, దానికి వచ్చిన స్పందన ఊహించని స్థాయిలో ఉంది.
ఆ వేడి చల్లారకముందే రాజమౌళి – కీరవాణి టీం మరో సర్ప్రైజ్ అందించింది. సినిమా మ్యూజికల్ సోల్‌గా చెప్పబడుతున్న “గ్లోబ్ ట్రాటర్” థీమ్ సాంగ్ విడుదల చేసింది. ఈ పాట మొదటి నిమిషం నుంచే ఫ్యాన్స్‌లో వైబ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ థీమ్ సాంగ్ పూర్తిగా గ్లోబల్ స్టాండర్డ్‌లో ఉంది. ఇది ‘బాహుబలి’ ఎమోషన్ కాదు, ‘RRR’ మాస్ కాదు పూర్తిగా ఒక హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ థీమ్ అని చెప్పాలి. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్, ట్రెజర్ హంట్ వైబ్ వాటన్నింటికి కీరవాణి తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు.
ఈ పాటలో సింగర్ ఎంపిక కూడా హైలైట్‌గా మారింది. శ్రుతి హాసన్ తన ప్రత్యేకమైన హస్కీ, పవర్ఫుల్ వాయిస్‌తో ఈ సాంగ్‌కు అదనపు ఎనర్జీ ఇచ్చింది. ఇది తెలుగు పాటలా కాకుండా ఒక ఇంటర్నేషనల్ అడ్వెంచర్ యాంథమ్ లా వినిపిస్తోంది. శ్రుతి పలికిన “సంచారీ… సంచారీ…” లైన్స్ తో పాట మూడ్ మొత్తం సెట్ అయిపోయింది. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ రాసిన పదాలు మహేష్ బాబు క్యారెక్టర్ గురించి స్పష్టమైన క్లూస్ ఇస్తున్నాయి . “కాలాన్ని శాసిస్తూ… ప్రతిరోజూ పరుగేలే”, “వేగాన్నే శ్వాసిస్తూ…” అనే లైన్స్ ద్వారా మహేష్ పాత్ర టైమ్‌తో రేస్ పెట్టుకుంటూ, గ్లోబ్ చుట్టేసే ఒక ఫియర్లెస్ ట్రావెలర్, “గ్లోబ్ ట్రాటర్” అని క్లారిటీ ఇస్తున్నాయి. అంతేకాక క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉన్నాయా? అనే క్యూరియాసిటీని కూడా పెంచుతున్నాయి. మొత్తం మీద “గ్లోబ్ ట్రాటర్” థీమ్ సాంగ్‌తో SSMB29 స్కేల్, టోన్‌పై స్పష్టమైన ఐడియా వచ్చేసింది . ఇది ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని ఒక గ్లోబల్ అడ్వెంచర్ అనుభవం ఇవ్వబోతోంది.