నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గల ఆంజనేయస్వామి ఆలయానికి దాత వనజ సాయి రెడ్డి పూజ సామాగ్రిని అందజేశారు. ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి కావలసిన గదా, శఠగోపం, మంగళహారతులు, సప్త దీపాల సామాగ్రి, త్రిశూలం, చత్రి తదితర సామాగ్రిని విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని దాత వనజ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు హరిప్రసాద్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సుధీర్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.