మేడ్చల్ : బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించామని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ( MLA Mallareddy) తెలిపారు. కీసర మండలం తిమ్మాయిపల్లిలోని ధర్మారం గ్రామంలో శనివారం కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో మేడ్చల్ జిల్లా (Medchal) లో అభివృద్ధి పనులు చేసి తెలంగాణలోనే ఆదర్శ జిల్లాగా నిలబెట్టామని అన్నారు.
గ్రామాల్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు (CC Roads), మురికి కాలువల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఆటకెక్కుతుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల( Six Gurantees) ను అమలులో కాంగ్రెస్ (Congress ) విఫలం కావడం ఖాయమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.