– విశ్వనాథపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా తారా ఉష నామినేషన్
కారేపల్లి, డిసెంబర్ 05 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హలావత్ తారా ఉష శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా యువజన నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు, మాజీ వార్డు సభ్యుడు గుగులోత్ రవితో కలిసి విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం వారు గ్రామంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తారా ఉషను గ్రామ పంచాయతీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక్క బీఆర్ఎస్ కే సాధ్యం అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీకి అనేక సీసీ రోడ్లు, విశ్వనాధపల్లి గ్రామం నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ, బుగ్గ వాగు వరకు బిటి రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, నాయకులు తాతా వెంకన్న, సిద్ధంశెట్టి చిన్న నాగయ్య, తాత ఉపేందర్ పాల్గొన్నారు.