కనగల్, నల్గొండ రూరల్, జనవరి 20 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీకర్ బాక్స్ అందజేశారు. అలాగే నల్లగొండ మండలం అప్పాజీపేట హైస్కూల్ కు రూ.25 వేల విలువైన ఐదు డెస్క్ బెంచ్ లను బహుకరించారు. ఐకాన్ క్లబ్ అధ్యక్షుడు బచ్చు మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మదన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ అంతర్జాతీయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
నల్లగొండ జిల్లాలోనూ ఈ ఏడాది ప్రత్యేకంగా విద్యా, వైద్యం పరంగా ప్రత్యేక సేవా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. యువ వికాసం పేరుతో విద్యార్థులకు, యువతకు వ్యక్తిత్వ వికాసంలో మోటివేషనల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నతనంలోనే విజృంభిస్తున్న క్యాన్సర్ పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జూన్ చైర్ పర్సన్ పసలపూడి ఝాన్సీ రాణి మాట్లాడుతూ.. విద్యార్థుల వ్యక్తిగత అలవాట్లు, మంచి ఆహారం, సామాజిక స్పృహ, పోటీ పరీక్షల సన్నద్ధతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ డాక్టర్ వీర్లపాటి రితీష్, వైస్ ప్రెసిడెంట్ ఎం.మహేందర్ రెడ్డి, సభ్యులు అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, హెచ్ఎంలు ఈ.వెంకటేశ్వర్లు గుప్తా, కంచర్ల లింగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Nalgonda Rural : ఐకాన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీలు, స్పీకర్ బాక్స్ అందజేత