Litton Das : పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. భారత్‌లో ఆడబోమని ఆ దేశ క్రికెట్ బోర్డు పునరుద్ఘాటిస్తుండగా.. జనవరి 21లోపు నిర్ణయం చెప్పాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. అయినా కూడా బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు మా నిర్ణయంలో మార్పు లేదని అంటున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) వరల్డ్‌కప్ మ్యాచ్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రపంచకప్ సమీపిస్తున్నా బంగ్లాదేశ్ బోర్డు మాత్రం భారత్‌లో ఆడేందుకు ససేమిరా అంటోంది. గ్రూప్ స్వాపింగ్ అభ్యర్థనకు ఐసీసీ అంగీకరించకపోవడంతో తమ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దాంతో.. ఆ జట్టు వరల్డ్‌కప్ ఆడడంపై ఉత్కంఠ నడుస్తోంది. ఇదే విషయంపై కెప్టెన్ లిటన్ దాస్ స్పందిస్తూ.. మేము ప్రపంచకప్ ఆడుతామో లేదో తెలియదు అంటున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అతడు సారథ్యం వహిస్తున్న రంగాపూర్ రైడర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
🚨 One-time expense: Govt on new labour codes lowering firms’ profit #business
🚨 Are you sure we are going to play in T20 World Cup?: Bangladesh captain Litton Das to reporter #cricket pic.twitter.com/SQtCv8TKkE
— Buzz Indica (@buzz_indica) January 20, 2026
అనంతరం మీడియాతో మాట్లాడిన దాస్.. మా జట్టు వరల్డ్ కప్ ఎవరితో ఆడుతుందో, ఎక్కడ ఆడుతుందో తెలియదు అని చెప్పాడు. మా ఆటగాళ్లు అందరూ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. వరల్డ్‌కప్‌లో మా గ్రూప్‌లో ఎవరుంటారు? ఎక్కడ ఆడుతాం? అనేది నాకే కాదు మాలోని ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మా దేశం ఒకరకమైన అనిశ్చితిలో ఉంది. ప్రపంచకప్‌లో మా జట్టు షెడ్యూల్ మార్పు? గురించి మీకు తెలియదు. నాకు తెలియదు. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉంది అని లిటన్ దాస్ వెల్లడించాడు.
తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని లేదంటే.. ‘గ్రూప్ స్వాపింగ్’ చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. కానీ, ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున మార్పులకు అంగీకరించమని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఒకవేళ ఇండియాలో ఆడకూడదనుకుంటే.. ఐర్లాండ్‌కు అవకాశమిస్తామని చెప్పేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ (Asif Nazul) భారత్‌లో ఆడబోమనే మాటనే పునరుద్ఘాటించారు.
ICC’s conditions unacceptable, Bangladesh adviser Asif Nazrul
Read @ANI Story | https://t.co/fVmQ1iNrI9#ICC #Bangladesh #AsifNazrul pic.twitter.com/93vEba4y99
— ANI Digital (@ani_digital) January 20, 2026
‘ప్రపంచకప్‌లో మా జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశమిస్తారనే విషయం నాకు తెలియదు. భారత బోర్డు ఒత్తిడికి ఐసీసీ తలొగ్గి మాపై ఒత్తిడి పెంచాలనుకోవడం సరికాదు. ఐసీసీ సూచనలకు మేము అంగీకరించం. గతంలో షెడ్యూల్ మార్చిన ఉదాహరణలున్నాయి. భారత్‌లో ఆడమని పాకిస్థాన్ బోర్డు పట్టుపడితే ఐసీసీ దిగొచ్చి వేదికను మార్చింది. మేము వేదికను మార్చాలని మాత్రమే అడిగాం. అందుకు అవకాశమివ్వకుండా ఎలాగైనా ఒత్తిడి పెంచి భారత్‌లో ఆడేలా చేయాలనుకోండం ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన వెల్లడించారు.