BRS Denmark | తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణ జరుపుతున్న విషయాన్ని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ తీవ్రంగా ఖండిస్తుందని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం, దృష్టి మరల్చే కుట్ర మాత్రమే. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అవిరామంగా కృషి చేసిన నాయకుడన్నారు.
మిషన్ కాకతీయ, రైతు బంధు, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో జరుపుతున్నఈ విచారణ రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నది, ప్రజాసేవకుడైన హరీశ్ రావును అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై ఇలాంటి కేసులు పెడుతోందని స్పష్టమవుతోంది. హరీశ్ రావు చట్టాన్నిగౌరవిస్తూ విచారణకు హాజరయ్యారు.. కానీ ఇది పూర్తిగా రాజకీయ రంగంలో దుర్వినియోగం. బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ తరపున ఈ అన్యాయమైన విచారణను తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, న్యాయం కోసం బీఆర్ఎస్ పార్టీ అంచలంచెలుగా పోరాడుతుంది. హరీశ్ రావుకు మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్