కట్టంగూర్, మార్చి 21 : కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ చెరుకు నర్సింహ్మ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం గౌరవ సలహాదారుడిగా నియమితులయ్యాడు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో నర్సింహ్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నర్సింహ్మ మాట్లాడుతూ ఉప సర్పంచ్లకు గ్రామీణాభివృద్ధి, సమస్యల పరిష్కారంలో సూచనలు, సలహాలు ఇస్తానని తెలిపారు. నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్, సహకరించిన జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.