న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ముంచెత్తుతోంది. ఇప్పటికే 19 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. గురువారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. ఎయిమ్స్, రకబ్ గంజ్‌తో పాటు నగరం అంతటా వర్షం కురుస్తున్నది. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద ప్రవాహస్తోంది. ఇదిలా ఉండగా.. రాబోయే రెండుగంటల్లో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం ఢిల్లీలో 24 గంటల్లో 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చాణక్యపురిలోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్, కన్నాట్ ప్లేస్, ఐటీఓ, జనపథ్, రింగ్ రోడ్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇంతకు ముందు సెప్టెంబర్ 13, 2002న జాతీయ రాజధానిలో 126.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో సెప్టెంబర్ 16, 1963న 172.6 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. బుధవారం నగరంలో కేవలం మూడు గంటల్లో 75.6 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డింది. భారీ వానకు నగరవ్యాప్తంగా 27 చెట్లు నేలకొరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Heavy rain hits the National Capital for second day in a row, causing partially waterlogged roads. Visuals from near AIIMS, pic.twitter.com/GqbiuiiNTl
— ANI (@ANI) September 2, 2021