Dense Fog | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగ (Dense Fog) కమ్మేసింది. దీంతో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది. ఈ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విజిబిలిటీ పడిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది (Flight Disruptions Likely). పలు విమానాలు రద్దుకాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్నింటిని అధికారులు దారి మళ్లించారు.
పొగమంచు విపరీతంగా కురుస్తున్నందున విజిబిలిటీ తగ్గిపోవడంతో పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రకటించాయి. విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులు ఆన్లైన్లో రీబుక్ చేసుకోవచ్చని, లేదంటే డబ్బు వాపసు పొందవచ్చని తెలిపాయి. మరోవైపు రైలు సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
పొగమంచు పరిస్థితులకు తోడు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక కూడా చాలా పేలవమైన వర్గంలో నమోదైంది. శుక్రవారం ఉదయం నగరంలో ఏక్యూఐ లెవెల్స్ 386గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) తెలిపింది. 26 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. అత్యధికంగా ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 423గా నమోదైంది.
Also Read..
Snowfall | కశ్మీర్‌పై మంచు దుప్పటి.. కనుచూపు మేర హిమపాతమే.. VIDEOS