ఖమ్మం : ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారు నిద్రలో ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు. నారాయణరావు దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ధాటికి ఇంట్లోని సామాత్రి పూర్తిగా కాలిపోయింది. అంతేగాక చుట్టుపక్కల ఇళ్లలోని తలుపులు, కిటీకిలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.