Delhi | చలి తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) గజగజ వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి (Lowest Temperature). శనివారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇప్పటి వరకూ ఈ సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలు అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సీజన్ సగటు కంటే 2.7 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్, పాలంలో 4.5 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్డులో 4.7 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్‌లో 5.3 డిగ్రీల సెల్సియస్, అయానగర్‌లో 4.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు నగర వాసులు వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
విమాన రాకపోకలపై ప్రభావం..
మరోవైపు నగరంలో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే అనేక విమానాలు రద్దయ్యాయి (Several Flights Affected). కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.
వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత..
ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. శనివారం ఉదయం నగరంలో గాలి నాణ్యత సూచిక 358గా నమోదైంది. నెహ్రూ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426గా, ఆనంద్ విహార్‌లో 422, వివేక్ విహార్‌లో 408, సిరిఫోర్ట్‌లో 404గా గాలి నాణ్యత నమోదైంది. పట్పర్గంజ్ (400), ద్వారకా సెక్టార్-8లో (399), ఓఖ్లా ఫేజ్-2లో (398), జేఎల్ఎన్ స్టేడియంలో (394), ఆర్కేపురం, చాందినీ చౌక్ వద్ద (390), రోహిణిలో (372), పంజాబీ బాఘ్, ముంద్కాలో 368, అశోక్ విహార్ ప్రాంతంలో 359, బావనాలో 346, ఆయా నగర్లో 344, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టర్మినల్-3 వద్ద (325), అలీపూర్ ప్రాంతంలో 302గా గాలి నాణ్యత సూచిక నమోదైంది.
Also Read..
ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగానికి సిద్ధం.. తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
Dal Lake | గడ్డకట్టిన దాల్ సరస్సు.. VIDEO