హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో ఉన్న శ్రీదుర్గా భవాని ఆయలంలో కొలువైన దుర్గామల్లేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjaya) ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గోత్రనామాలతో ఆయన అర్చన చేయించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చన, పూజ చేశారు.

కేంద్ర మంత్రి సంజయ్కు ఆలయ కమిటీ స్వాగతం పలికింది. ఆలయంలో కొలువైన దుర్గాభవాని అమ్మవారు, మేధా దక్షిణామూర్తి స్వామిని కూడా ఆయన దర్శించుకుని పూజలు చేశారు. కేంద్ర మంత్రిని పూలమాల, శాలువాతో ఆలయ కమిటీ సత్కరించింది. సుమారు 15 నిమిషాల పాటు శ్రీదుర్గాభవాని ఆలయంలో కేంద్ర మంత్రి గడిపారు.

సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు అయిన సందర్భంగా బీజేపీ పార్టీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వం నిర్వహిస్తోంది. వెయ్యేళ్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఆ ఆలయం ఇప్పటికీ సగర్వంగా, వైభవోపేతంగా నిలబడింది. అయితే ఆలయ పునర్ నిర్మాణం చేపట్టి 75 ఏళ్లు అవుతున్నది. 1951లో ఆ ఆలయాన్ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో భక్తుల కోసం తెరిచారు.

ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన అన్ని శివాలయాల్లో ఓంకార మంత్రాన్ని పఠించాలని, అభిషేకాలు, పూజలు, అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ తీర్మానించింది.
మహాశివుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన గుజరాత్ సోమ్ నాథ్ పై దాడి జరిగి ఈ ఏడు వెయ్యేళ్లు అవుతుంది. వెయ్యేళ్లుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహిమాన్విత క్షేత్రం భారత అధ్యాత్మికత, నాగరికత, వారసత్వ వైభవోపేతానికి సజీవ సాక్షిగా నిలబడింది. అంతేకాదు, ఈ ఆలయ పునర్నిర్మాణం… pic.twitter.com/4XNuu7t4xg
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 10, 2026
भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे। pic.twitter.com/XounUARIFb
— Narendra Modi (@narendramodi) January 9, 2026