Talasani : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని తలసాని ఆకాంక్ష వెలిబుచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.