ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 (PSLV-C62) రాకెట్‌ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్-ఎన్1 శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ (ISRO Chairman) వి.నారాయణన్ (V Narayanan) ఇవాళ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు (Sri Venkateswara Temple). శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే అధికారులు ఇస్రో చీఫ్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
VIDEO | Tirumala: An ISRO team led by Chairman Dr V Narayanan offered prayers at the Tirumala temple, seeking blessings for the successful launch of the PSLV-C62 rocket scheduled from Sriharikota (SHAR) on January 12.
ISRO Chairman Dr V Narayanan says, “The PSLV-C62 / EOS-N1… pic.twitter.com/ilTau18sD5
— Press Trust of India (@PTI_News) January 10, 2026
Also Read..
Dal Lake | గడ్డకట్టిన దాల్ సరస్సు.. VIDEO
Chinese Woman | భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. చైనా మహిళ అరెస్టు