water shortage : దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తామని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. వడగాలుల ఉధృతితో ఢిల్లీలో నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, హరియాణ వంటి రాష్ట్రాల నుంచి అదనపు నీటిని తెప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టామని చెప్పారు.
ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ట్యాంకర్ మాఫియాపై చర్యలు చేపడతామని తెలిపారు. ట్యాంకర్ మాఫియా ఆగడాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఏడీఎంలు, ఎస్డీఎంలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. చతుర్వేది బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైషమ్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం విచారకరమని అన్నారు.
ఇరు ప్రభుత్వాలు తమ రాజకీయ విభేదాలను విడనాడి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. ప్రభుత్వాలు రాజకీయ పంతాలకు పోయి ప్రజలను సమస్యల్లోకి నెట్టడం సరైంది కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నీటి ఎద్దడి నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.
Read More
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్