న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగబోయే ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అవతలి పక్షమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వాదనలు వినకుండా ఇలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు.
అయితే, డబ్ల్యూఎఫ్ఐ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమగ్ర సమాధానం ఇచ్చేందుకు వినేశ్‌కు హైకోర్టు అనుమతించింది. జూలై 6లోపు ఈ షోకాజ్ నోటీసు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి, ఆ నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని ఫెడరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది.