న్యూఢిల్లీ, మే 18 : ప్రతిష్ఠాత్మక క్యాట్-ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్(క్యూఎఫ్ఐ) అర్హతను పొందిన తొలి మహిళా అధికారిగా స్కాడ్రన్ లీడర్ సాన్యా చరిత్రాత్మక ఘనతను సాధించినట్లు భారతీయ వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం తెలిపింది.
ఇది ఐఏఎఫ్‌కు గర్విచదగిన ఒక మైలురాయిగా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక విమానయాన నిపుణులకు స్పూర్తిదాయకమని ఒక పోస్టు లో ఐఏఎఫ్ పేర్కొంది. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్కాడ్రన్ లీడర్ సాన్యను సత్కరిస్తున్న ఫోటోలను కూడా ఐఏఎఫ్ పంచుకుంది.