హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి టీజీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్ కోరారు.
కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉద్యోగులు జనగణన విధుల్లో ఉన్నారని, విధుల్లో లేని వారిని బదిలీ చేయాలని కోరుతూ సోమవారం ఇంటర్ విద్య డైరెక్టర్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2024లో సాధారణ బదిలీలు చేపట్టలేదని, తాజా బదిలీల్లో అవకాశం కల్పించాలని కోరారు.