హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల్లో హానరోరియంపై కన్సల్టెంట్ విధులు నిర్వర్తిస్తున్న 11మంది సిబ్బందిని తొలగించారు. సొసైటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
సొసైటీలో సిస్టమ్ అడ్మిన్, ప్రోగ్రామర్లు, పీఆర్వోలు, అకాడమిక్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఏపీఆర్వో, టెక్నికల్ అసిస్టెంట్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్, సెక్రెటరీకి పీఏగా పలువురు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని తాజాగా తొలగించారు. ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.