DC vs MI IPL match : ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో ఢిల్లీ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆరంభం నుంచే వీరవిహారం చేస్తున్నాడు.
కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి 24 బంతుల్లో 78 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మెక్‌గుర్క్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 325. మరో ఓపెనర్ అభిషేక్ పొరెల్ నిదానంగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లలో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తానికి ఆరు ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.