నార్నూర్ : ఆదివాసుల హక్కుల కోసం నిజాం సర్కారుతో పోరాడిన సమరయోధుడు కుమ్రం భీం (Kumram Bheem ) 85వ వర్ధంతిని (Death anniversary) విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం భవనంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈనెల 12వ తేదీన కుమ్రం భీం వర్ధంతిని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వర్ధంతి సభను విజయవంతం చేసేందుకు ఆదివాసి అనుబంధ సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, మాన్కాపూర్ మాజీ ఉపసర్పంచ్ రాయి సిడం రూప్ దేవ్, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తదితరులున్నారు.