– బీఆర్ఎస్వీ ఎంజీయూ అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, జనవరి 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్‌కు 200 మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. అకాడమిక్ అల్మనాక్ ప్రకారం ఫిబ్రవరి 02 వరకు చివరి వర్కింగ్ డే ఉన్నప్పటికీ ముందుగానే పరీక్ష ఫీజులు వసూలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉండటం, అలాగే కండోనేషన్ ఫీజు విద్యార్థులపై ఆర్థిక భారంగా మారిందన్నారు. కావునా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 02వ తేదీ వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కొమ్ము గణేష్ పాల్గొన్నారు.