బచ్చన్నపేట ఆగస్టు 29 : రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కార్యదర్శి దాసగాని సుమ అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన మండల మహాసభకు ముఖ్యఅతిథిగా సుమ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య రంగ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నిమిది వేల కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలన్నారు. సంక్షేమ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలి అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులా లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. అనంతరం నూతన మండల కమిటిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు యాకన్నా రాథోడ్, జిల్లా సహాయ కార్యదర్శి బొమ్మిశెట్టి ఆర్య మండల నాయకులు మురళి కృష్ణ, అరవింద్, రాకేష్, సాగర్, అరవింద్, నివేదిక, పూజిత, ఆనంద్, అఖిల్, శ్రీధర్, సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.