ముంబై : అభిమాన సెలబ్రిటీల ఆహార అలవాట్ల నుంచి వర్కవుట్ రొటీన్స్ వరకూ ప్రతి ఒక్క విషయంపై ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. సెలబ్రిటీలు సైతం తమ దైనందిన జీవితం, హాబీలు, వర్కవుట్స్, డైట్ సహా అన్ని విషయాలనూ సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక లేటెస్ట్గా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచిస్తూ ట్యూస్డేటిప్స్విత్బీ పేరుతో ఏకంగా ఇన్స్టాగ్రాం సిరీస్ నిర్వహించింది. ఈ సిరీస్‌లో ఆమె వివిధ ఆహార పదార్ధాలు అందించే ఆరోగ్య ప్రయోజనాలను వివరించింది.
ఈసారి ఆమె పెరుగు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. పెరుగు బౌల్‌తో కనిపించిన భాగ్యశ్రీ ఇది తన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొంది. పెరుగు పొట్టను చల్లగా ఉంచడంతో పాటు అసిడిటీని తగ్గించి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుందని తెలిపింది. పెరుగులో విటమిన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయని, ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహకరిస్తుందని వెల్లడించింది. పెరుగు తరచూ తీసుకుంటూ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని ఆమె ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.
ప్రేవుల ఆరోగ్యానికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుందని, ఇది జీర్ణక్రియకు సహకరిస్తుందని, పెరుగు ముఖ్యంగా శాకాహారులకు మంచి ప్రొటీన్, విటమిన్ డీ అందచేస్తుందని భాగ్యశ్రీ తెలిపింది. శరీరంలో సెరటోనిన్‌ను పెరుగు ప్రేరేపిస్తుందని, ప్రతిరోజూ భోజనంలో లేదా భోజన విరామాల్లో పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని కోరింది.
Read More :
MLC Shaik Sabji | రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం