తిరుమల : ‘గోవిందా హరి గోవిందా.. గోకులనందా గోవిందా ’ అనే నిత్య నామ స్మరణతో మారుమ్రోగే తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarshanam ) అయిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 68,075 భక్తులు దర్శించుకోగా 26,535 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.80 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ( EO Anil Kumar Singhal ) చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవోలో మాట్లాడారు. , ఇందుకోసం ఆఫ్లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.