Asia Cup Controversy | ఆసియా కప్ వివాదం ముగిసినట్టే..! పరిష్కారానికి ప్రత్యేక కమిటీని వేసిన ఐసీసీ..!
Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతంలో పలు వివాదాల సమయంలో ఆయన మధ్యవర్తిత్వం వహించారు.
Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతంలో పలు వివాదాల సమయంలో ఆయన మధ్యవర్తిత్వం వహించారు. ఓ నివేదిక ప్రకారం.. ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని లేవనెత్తింది. దాంతో ఐసీసీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాక్‌పై భారత్ విజేతగా నిలిచింది. అయితే, పీసీబీ, ఏసీసీ చైర్మన్‌గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని ప్రదానం చేసేందుకు వేదికపైకి రాగా.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించాడు.
నఖ్వీ పాక్ హోం మంత్రిగా కొనసాగుతుండడంతో ట్రోఫీని అందుకునేది లేదని స్పష్టం చేశాడు. భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంలో ఆయన పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం ట్రోఫీని అందుకునేందుకు సూర్య నిరాకరించినట్లు నివేదికలు తెలిపాయి. ఏసీసీ అధ్యక్షుడిగా ట్రోఫీని ప్రదానం చేసే అధికారం తనకు మాత్రమే ఉందని నఖ్వీ స్పందించగా.. ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబురాలు చేసుకుంది. దాంతో నొచ్చుకున్న నఖ్వీ ఆసియా కప్, మెడల్స్‌ను తీసుకెళ్లిపోయారు. ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఈ అంశాన్ని లేవనెత్తింది. సమావేశంలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు రెండుదేశాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించాయి.
ట్రోఫీని వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేసేందుకు అంగీకరించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పీసీబీ చైర్మన్ నఖ్వీ సైతం హాజరయ్యారు. భారత్, పాక్ రెండు క్రికెట్ ప్రపంచంలో కీలకమైన సభ్యదేశాలని.. విభేదాలను పరిష్కరించేందుకు ఐసీసీ బోర్డు అంగీకరించదని మీడియా నివేదికలు తెలిపాయి. పాక్ సెనేట్ కీలక సమావేశం వాయిదా పడినందున.. నఖ్వీ చివరి నిమిషంలో దుబాయిలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ట్రోఫీ వివాదాన్ని పరిష్కార బాధ్యతలను ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఖిమ్జీపై ఉండగా.. రెండుదేశాల బోర్డులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. దాంతో వివాదం సమసిపోతుందని ఐసీసీ భావిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | తెలంగాణ సెక్రటేరియట్‌లా కనిపిస్తుందంటూ చంద్రబాబు ప్రశంసలు
Revanth Reddy | సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్.. నందిపహాడ్లో దుర్మార్గం
సంకీర్ణాన్నిశాసించి పథకాలెన్నో సాధించి.. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రుజువైందిదే!
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

