TDP | బంజారాహిల్స్,జూన్ 5: ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ ఉండగా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన మియాపూర్‌కు చెందిన టీ వెంకటకృష్ణారెడ్డి, జీ మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ శివరాజ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 188,153 (ఏ) (బీ),185 (ఏ) మోటర్ వెహికల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.