నీలగిరి, నవంబర్ 18: ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు దొంగ నాటకా లు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సూచించారు. నిజంగా వారికి రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ దిశగా బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేయకుండా ఆందోళనలు చేయ డం సరికాదన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రధానిపై ఒత్తిడి తెచ్చి యాసంగిలో వరి పంట వేసుకోవాలనే ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.