Operation Kagar | పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 28 : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీల హననాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్‌ను ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టీయూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ.. చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారని కేంద్ర ప్రభుత్వం 10000 పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేయడం, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అంతమొందించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జరుగుతున్న దాడులను ఆపాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
కర్రెగుట్ట ప్రాంతంలో మోహరించి ఉన్న కేంద్ర పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు. అరెస్టు చేసిన ఆదివాసులను విడుదల చేయాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ నాయకులు ఈదునూరి నరేష్, అశోక్, రాజేశం, చిలుక, శంకర్, బాలకృష్ణ, లింగమూర్తి, ప్రసాద్, వసంత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్