తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించండి
తెలంగాణను కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు.
- సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కరువు ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎవరైనా నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వచేసి, బ్లాక్ మారెటింగ్కు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
గోదాముల్లో సరుకులను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై సీపీఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పేదలకు పంచుతామని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీపీఐ బృందం నవంబర్ 3, 4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటిస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసే అంశంపై పార్టీ నాయకత్వం చర్చిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

