వాటర్ హాలిడే.. మంచినీళ్లు వారంలో రెండే రోజులు
జలమండలి నీటిని వారానికి రెండు రోజులు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు.
- ప్రైవేట్ ట్యాంకర్లు నిషేధిస్తే అదీ అసాధ్యమే
- వెస్ట్ సిటీలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు
- జలమండలి ట్యాంకర్లపై మరింత ప్రభావం
కాంగ్రెస్ తెచ్చిన కరువు కారణంగా హైదరాబాద్‌కు తాగునీటి గండం రాబోతున్నది. ఇకపై వారానికి రెండు రోజులే మంచినీటి సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా వెస్ట్ సిటీలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, సైబర్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో గడ్డు పరిస్థితులు నెలకొననుండగా విలీన మున్సిపాలిటీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారనున్నది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జలమండలి నీటిని వారానికి రెండు రోజులు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. దీనికితోడు ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను నిషేధిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లోని 3 లక్షల నుంచి 5 లక్షల జలమండలి నీటి కనెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా పశ్చిమ నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, సైబర్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో అత్యంత తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.
విలీన మున్సిపాలిటీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఇప్పటికే బోడుప్పల్, పీర్జ్జాదీగూడ వంటి ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను కట్టడి చేస్తే మరింత నీటిఎద్దడి ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం మూడురోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ఇప్పటికే నీటిఎద్దడితో అవస్థలు పడుతున్న ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంకర్లకు పెరుగనున్న డిమాండ్
జలమండలి ట్యాంకర్లు ఇప్పటికే రికార్డు స్థాయిలో ప్రతిరోజూ ఏడు వేలకు మించి బుక్ అవుతున్నాయి. సాధారణంగా అక్టోబర్ నుంచి జనవరి దాకా రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల ట్యాంకర్లు మాత్రమే బుక్ అవుతాయి. కానీ, ఈసారి సెప్టెంబర్ చివరి వారం నుంచే రికార్డు స్థాయిలో బుకింగ్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వం జలమండలి నీళ్లను మూడు రోజులకు ఒకసారే సరఫరా చేయాలని నిర్ణయించడం, మరోవైపు ప్రైవేట్ ట్యాంకర్లను కట్టడి చేయడంతో బుకింగ్స్ పెరుగనున్నాయి.
డిసెంబర్ నుంచి రోజువారీ బుకింగ్స్ 15 వేల ట్యాంకర్లకుపైగా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే బుక్ చేసిన ట్యాంకర్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. హైదరాబాద్ శివారులో ముంచుకొస్తున్న నీటి గండం నిర్మాణ రంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. నవంబర్ 1వ తేదీ నుంచి నిర్మాణ పనుల కోసం మంచినీరు, బోరునీళ్లు వాడకూదని, కచ్చితంగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడాలని సర్కార్ ఆంక్షలు విధిస్తుండటంతో వ్యాపారులు దిక్కులు చూస్తున్నారు. రీసైక్లింగ్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్‌పరిధిలో నిర్మా ణ సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

