ఐటీ హాలిడే.. కరెంటు కష్టాల్లో సైబరాబాద్
కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్ చేతగాని తనంతో హైదరాబాద్ ఐటీ రంగానికి కూడా హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
- ఐటీ కారిడార్‌కు వర్క్‌ఫ్రమ్ హోమ్
- సైబరాబాద్‌లో కరెంట్ కష్టాలకు
- ఇది రేవంత్ తరహా పరిష్కారం?
- అప్రకటిత కోతలతో ఉకిరిబికిరి
కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్ చేతగాని తనంతో హైదరాబాద్ ఐటీ రంగానికి కూడా హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అయిన ‘హైదరాబాద్ ఐటీ’ త్వరలోనే బంద్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమకు నెలవైన సైబరాబాద్‌లో కరెంట్ కష్టాలు తీవ్రం కావడంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతున్నారా? అంటే ‘అవును’ అనే సంకేతాలే వెలువడుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ ఐటీ రంగం కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నదా? విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో ఐటీ ఆఫీసులు మూతపడనున్నాయా? ఇకనుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐటీ పరిశ్రమకు అవసరమైన విద్యుత్తును అందించలేక త్వరలోనే వర్క్ ఫ్రమ్ హోంను ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలోనే వెలువడుతాయనే ప్రచారం జరుగుతున్నది. ఐటీ పరిశ్రమకు నెలవైన సైబరాబాద్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. తరచూ తలెత్తుతున్న విద్యుత్తు అంతరాయాలు కలవరపెడుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయాలు కలవరపెడుతున్నాయి.
ఐటీ కారిడార్‌లో ఇకట్లు
మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయాలపై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నదని ఉద్యోగులు, స్థానికులు చెప్తున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో వైఫై రూటర్లు పనిచేయకపోవడం, మొబైల్ నెట్వర్ సమస్యలు తోడవడంతో ఉద్యోగ విధులకు ఆటంకం కలుగుతున్నది. కీలక సమయాల్లో కనెక్టివిటీ తెగిపోవడం ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం చూపుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం 70-80 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతున్నది. 2025లో వినియోగం సగటున 60 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండేది.
జిల్లాతో పోల్చితే సైబర్ సిటీ సర్కిల్లోనే
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్బిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్ వంటి ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలతో పోల్చితే ఈ ఒక్క సర్కిల్ వినియోగించే విద్యుత్తు అధికంగా ఉంటున్నది. ఈ నెల 27వ తేదీన సైబర్ సిటీ సర్కిల్లో 11.90 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ సర్కిల్లో అత్యధిక విద్యుత్తు వినియోగం పగటి పూటే ఉంటున్నది.
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో రోజు వారీ వినియోగం సైబర్‌సిటీ కంటే చాలా తక్కువ. వీటిలో గరిష్ఠంగా 9.90 మిలియన్ యూనిట్లు, కనిష్ఠంగా 4.02 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. నారాయణపేట జిల్లాతో పోల్చితే రెండు రెట్లు అధికంగా ఒక్క సైబర్ సిటీ సర్కిల్లోనే విద్యుత్తు వినియోగమైంది. మరీ ముఖ్యంగా ఈ నెల 1వ తేదీన 13.17 మిలిన్ యూనిట్ల విద్యుత్తును ఈ ఒక్క సర్కిల్లోనే వినియోగించడం గమనార్హం.
రాయదుర్గం సబ్‌స్టేషన్ ఓవర్‌లోడ్
ఐటీ కారిడార్‌కు విద్యుత్తునందించే గచ్చిబౌలి 220 కేవీ, 400 కేవీ సబ్స్టేషన్లు ఓవర్‌లోడ్‌తో సతమతమవుతున్నాయి. గచ్చిబౌలి సబ్‌స్టేషన్ కూడా ఓవర్‌లోడ్ సమస్యతో సతమతమవుతున్నది. ఓవర్ లోడ్ సమస్య నేపథ్యంలో టీజీ ట్రాన్స్‌కో కోకాపేటలో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. ఫలితంగా రెండేండ్లుగా ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం అటకెక్కింది. మరోవైపు, గ్రేటర్లో విద్యుత్తు వినియోగం అమాంతం పెరుగుతున్నది. 2025వ సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది దాదాపు 15% వినియోగం పెరిగింది. ఐటీ కారిడార్‌కు విద్యుత్తునందించే ఉన్న ఒక్క సబ్‌స్టేషన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తం ఐటీ కారిడార్ చీకటిమయంగా మారే ప్రమాదం పొంచి ఉన్నది.
ఎదురవుతున్న సమస్యలు
తరచూ పవర్ కట్ అవుతుండటంతో ఐటీ కంపెనీలు జనరేటర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. డీజిల్ ఖర్చులు పెరిగి సంస్థలకు భారంగా మారుతున్నది.ఐటీ కంపెనీలు నిర్దిష్ట సమయంలోనే ఇచ్చిన గడువులోనే ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాలి. విద్యుత్తు కోతలతో ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తికావడం లేదు. ఉద్యోగులతో ఆన్లైన్ మీటింగ్‌లు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

