సుబేదారి, జూన్18: వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ స్పష్టం చేశారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి సాగు, రవాణా చేసినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. గత 2024 జూలై నుంచి ఇప్పటి ఇప్పటికు డ్రగ్స్ కంట్రోల్ టీం 8కోట్ల, 57లక్షల,90వేల విలువ చేసే1241 కీలోల గంజాయి, 251 గంజాయి చాక్లెట్లు, హషీస్ ఆయిల్, బ్రౌన్ షుగర్, 2లక్షల,15వేల నగదు, 601 ఫోన్లు, 63బైక్‌లు, 8కార్లు, 6 ఆటోలు స్వాదీనం చేసుకొని 192 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దన్నారు. ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా గంజాయి కానీ, ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన వెంటనే 8712685299, 8712584473, లేదా డయల్ 100 కాల్ చేయాలి, సమాచారం అధించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయని సీపీ కోరారు.