సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కొత్తగా రిక్రూట్ అయిన ఆర్ఎస్ఐలతో గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సమావేశమయ్యారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ వారికి సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ షమీర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.