Covid vaccines compulsory | కొవిడ్ టీకాపై నిర్లక్ష్యం చేయొద్దు
Covid vaccines compulsory | కొవిడ్ టీకాపై ఎలాం టి నిర్లక్ష్యం చేయొద్దని కచ్చితంగా ప్రతిఒక్కరూ టీకాలు తీసుకోవాల్సిందేనని డీ.ధర్మారం వైద్యురాలు

ఇంటింటికీ కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు
ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్ రాణి
రామాయంపేట, డిసెంబర్ 28 : కొవిడ్ టీకాపై ఎలాం టి నిర్లక్ష్యం చేయొద్దని కచ్చితంగా ప్రతిఒక్కరూ టీకాలు తీసుకోవాల్సిందేనని డీ.ధర్మారం వైద్యురాలు ఎలిజబెత్రాణి అన్నారు. మంగళవారం పీహెచ్సీ పరిధిలోని శివాయపల్లి, సుతారిపల్లి, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ టీకాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. రెండు మండలాల పరిధిలోని వైద్య సిబ్బంది ఇంటింటికీ, వ్యవసాయ బావులు, పంట చేలల్లో పని చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి టీకాలు వేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ట్రాక్టర్, ఆటో డ్రైవర్లకు కూడా ఎక్కడికక్కడా టీకాలు వేస్తున్నామన్నారు. వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించి టీకాలు తీసుకోవాలని సూచించారు.
కరోనా కట్టడికి చర్యలు..
నిజాంపేట, డిసెంబర్ 28 : కరోనాను కట్టడి చేయాలంటే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం నిజాంపేటలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి టీకా వేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం బాలమణి మాట్లాడుతూ కరోనా టీకాపై నిర్లక్ష్యం తగదని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, అనిత, బాలమణి పాల్గొన్నారు.
ఘన్పూర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్..
తూప్రాన్ రూరల్, డిసెంబర్ 28 : మండలంలోని ఘన్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నవారికి మంగళవారం సెకండ్ డోస్ టీకా వేశారు. వారం రోజులోపు మండలంలోని అన్ని గ్రామాల్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ నిర్వాహుకులు పావని, లక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

