ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్ |

వాషింగ్టన్ : కరోనా కొత్త వేరియంట్లు ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) కొత్త వేరియంట్లపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాపై అధ్యయనం నిర్వహించింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా నిర్మూలించే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత్‌తో పాటు పలు దేశాల్లో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నది. కొవాగ్జిన్ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త సీరం నమూనాలపై SARS-CoV-2 ఆల్ఫా (B.1.1.7) డెల్టా (B.1.617) వేరియంట్లను సమర్థవంతంగా నిర్మూలించిందని ఎన్ఐహెచ్ తెలిపింది. కొవాగ్జిన్ టీకా కరోనాపై వంద శాతం పని చేస్తోందని ఎన్ఐహెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. కొవిడ్ లక్షణాలున్న వారిపై 78శాతం, కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారిపై 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని ఫౌసీ వివరించారు. ఎన్ఐఏఐడీ మద్దతుతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భారత్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన వ్యాక్సిన్లలో భాగమైనందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

