Balka Suman : చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు అనగా.. మార్చి 3 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్టు గురువారం మంచిర్యాల కోర్టు వెల్లడించింది. కాసేపట్లో పోలీసులు బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తలరించనున్నారు.
ప్రజాతీర్పును గౌరవించాల్సిందిపోయి రాజకీయ కక్షలకు కాంగ్రెస్ తెరతీస్తోంది. చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ ఆదేశాలతో పోలీసులు.. క్యాతన్ పల్లిలో మున్సిపల్ ఎన్నిక వాయిదాను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
నేను జైలుకు పోయినా కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవలేదు – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ https://t.co/G92kjLZFqX pic.twitter.com/vFCdEdO3vC
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026
మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాంతో, బుధవారం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసకున్నారు. మంచిర్యాల కోర్టు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో.. బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు బాల్క సమన్ను పరామర్శించనున్నారు.