కుభీర్ : మండల కేంద్రం కుభీర్‌లో శుక్రవారం నాగేష్ ఇండస్ట్రీస్‌లో వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు (Cotton procurement ) శ్రీకారం చుట్టారు. డిజిటల్ వేయింగ్ మిషన్‌కు, జిన్నింగ్ మిల్లులో యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్లాట్ కాంట వద్ద పత్తితో వచ్చిన వాహనానికి పూజలు చేసి రైతును సత్కరించారు. తూకం వేసి క్వింటాలు పత్తికి రూ. 7,251 ధర చెల్లించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, వైస్ చైర్మన్ అహ్మద్, తాజా మాజీ సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శిమార్కెట్ కమిటీ కార్యదర్శి, సిబ్బంది, వ్యాపారులు రెడ్డిశెట్టి నాగేశ్వర్, రెడ్డిశెట్టి ఆనంద్, రెడ్డిశెట్టి సంతోష్, నాయకులు బోయిడి విట్టల్, ప్యాట లక్ష్మణ్, కొట్టే హనుమాండ్లు, కనకయ్య, కందూరి సీను, బషీర్, వ్యాపారులు, పత్తి రైతులు పాల్గొన్నారు.