All time record | ఖమ్మంలో రికార్డు స్థాయి ధర పలికిన తెల్లబంగారం.. ఎంతంటే..?

ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మార్కెట్‌కు తీసుకవచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్(ఈ నామ్)లో గరిష్ట ధర క్వింటాల్ రూ 7,700 పలుకగా, మధ్య ధర రూ 7,200, కనిష్ట ధర రూ 5వేలు పలికింది.
గత కొద్ది రోజుల నుంచి మార్కెట్‌కు వానాకాలం సాగు చేసిన పంటను రైతులు తీసుకువస్తున్నారు. గత సంవత్సరం భారత పత్తి సంస్థ(సీసీఐ) క్వింటాల్ మద్దతు ధర రూ 5,725 చొప్పున ఖరార్ చేసి కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం సీసీఐ మద్దతు ధర రూ 6,025 నిర్ణయించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
దీంతో పంట ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉన్నందున సదరు వ్యాపారులు మొదటి నుంచే పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఏదేమైన గత 15 రోజుల నుంచి అంచెలంచెలుగా తెల్లబంగారానికి రెక్కలు వస్తూ ఏకంగా రాష్టంలోనే తొలిసారిగి రికార్డు స్థాయి ధర పలకడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. దీంతో ఈ సంవత్సరం పొరుగు జిల్లాల రైతులు ఖమ్మం మార్కెట్‌కు బారీగా పంటను తీసువచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cotton
- khammam
- price
- record-level
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

