సీఎం ఇలాకాలో పత్తి రైతుల ధర్నా
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని పత్తి మిల్లు ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు.
- గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్
- సీఎం నియోకవర్గంలో ధర తక్కువని ఆవేదన
- పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరలు
కొడంగల్, అక్టోబర్ 30: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని పత్తి మిల్లు ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. దౌల్తాబాద్ మండలం నీటూర్ గేటు వద్ద ఉన్న విజయ్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు యాజమాన్యం పత్తి పంటకు ధర తక్కువగా చెల్లిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లు యాజమాన్యం రూ.8,900 నుంచి రూ.9,200 వరకు మాత్రమే ధరలు చెల్లిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
పక్కనే ఉన్న కర్ణాటకలో రూ.10 వేలకు పైగా పత్తి ధర పలుకుతుందని, సీఎం సొంత ప్రాంతంలోనే తక్కువ ధరతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం స్పందించాలని, రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని అతికష్టంపై పత్తి పంటలు పండించినా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

